లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

1368చూసినవారు
లింగంపేట్ మండలం నాగారం గ్రామ శివారులో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలు (48)ను నిందితుడిగా అరెస్ట్ చేశారు. భూమి డబ్బుల విషయంలో మృతురాలితో మాట్లాడిన అనంతరం ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఇనుప రాడ్, OPPO సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్