అదుపుతప్పి చెరకు లారీ బోల్తా

5చూసినవారు
అదుపుతప్పి చెరకు లారీ బోల్తా
తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ వద్ద చెరకు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గాయత్రి చక్కెర కర్మాగారానికి వెళ్తున్న క్రమంలో, ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు అతడిని 108 వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్