కామారెడ్డిలో వడదెబ్బతో మహిళ మృతి

776చూసినవారు
కామారెడ్డిలో వడదెబ్బతో మహిళ మృతి
కామారెడ్డి జిల్లాలో వడదెబ్బతో మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం, సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల రాజవ్వ (56) వడదెబ్బతో మృతి చెందారు. కూలి పనికి వెళ్ళిన ఆమె అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురై, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్