జుక్కల్ సెగ్మెంట్లోని నిజాంసాగర్ మండలం వెలగనూర్ గ్రామానికి చెందిన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు కయ్యం వీరారెడ్డి ఏకైక కుమారుడు రాజేందర్ రెడ్డి (బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి) సోమవారం హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. ఆయన చిన్న వయస్సులోనే మృతి చెందడం కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త తెలుసుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తీవ్ర శోకానికి లోనై, మరణించిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.