NMC కీలక నిర్ణయం.. MBBS విద్యకు పదేళ్ల గడువు

5చూసినవారు
NMC కీలక నిర్ణయం.. MBBS విద్యకు పదేళ్ల గడువు
దేశంలో వైద్య విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ కోర్సు, ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయడానికి గరిష్ట గడువును 9 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతూ కొత్త డ్రాఫ్ట్ అమెండ్‌మెంట్‌ను జారీ చేసింది. ఈ సవరణతో విద్యార్థులు, మెడికల్ కాలేజీలు ఎదుర్కొంటున్న ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి 4 అటెంప్టుల పరిమితి యథాతథంగా కొనసాగుతుందని NMC స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్