పార్లమెంట్ భద్రతకు 'నెంబర్ 1 చెట్టు' అడ్డు

20912చూసినవారు
పార్లమెంట్ భద్రతకు 'నెంబర్ 1 చెట్టు' అడ్డు
కొత్త పార్లమెంట్‌ ప్రాంగణంలోని ఓ చెట్టు వీవీఐపీల భద్రతకు సవాల్‌గా మారింది. గజద్వారం వద్ద ఉన్న 'నెంబర్ 1' చెట్టుతో భద్రతా సమస్యలు వస్తున్నాయని ఎన్ఎస్జీ తెలిపింది. కొత్త పార్లమెంట్‌ కు వెళ్లే ఆరు మార్గాల్లో గజ ద్వారం ఒకటి. ఈ దారిలోనే ప్రధాని మోదీ తరచూ సభకు వెళ్తుంటారు. ఈ గేటు వద్ద ఓ పూల చెట్టు భారీగా పెరిగి భద్రతకు అడ్డంకిగా మారింది. దీంతో ఈ చెట్టును తొలగించడానికి ఎన్ఎస్జీ కసరత్తు చేస్తుంది.

సంబంధిత పోస్ట్