తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు ఆదివారం తిరుమలకు పోటెత్తారు. మాడవీధుల్లోని గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. సుమారు 4 వేల ప్రైవేట్ వాహనాలతో తిరుమలలోని పార్కింగ్ ప్రాంతాలు నిండిపోయాయి. ఈ కారణంగా, అధికారులు అలిపిరి వద్దే ప్రైవేట్ వాహనాలను నిలిపివేశారు. ప్రస్తుతం భక్తులను ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు.