పాస్‌పోర్ట్‌లో ఇంటిపేరు లేకపోవడంతో తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన నిజాముద్దీన్‌ను గల్ఫ్ ఎయిర్ మాస్కో ఎయిర్‌పోర్టులో బోర్డింగ్‌కు నిరాకరించింది. దీంతో ఆయన చెన్నైలోని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా, గల్ఫ్ ఎయిర్ తన తప్పిదాన్ని గుర్తించి నిజాముద్దీన్‌కు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టికెట్ ఖర్చు, మానసిక వేదనకు కలిపి రూ.1.4 లక్షలు 9% వడ్డీతో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.