తెలంగాణలో 22ఏ నిషేదిత భూముల పేరిట ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని ఆయన తెలిపారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను 22A జాబితాలో చేర్చామనే ప్రచారం అవాస్తవమని అన్నారు. బుధవారం సచివాలయంలో క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అర్హుల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను పరిరక్షించాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. 22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను గడువులోనే పరిష్కరించాలన్నారు.