ఏ రాష్ట్రంపైనా భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. తమిళనాడు పాఠశాలలో తమిళం, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మలయాళం, కన్నడ వంటి అనేక భాషలు బోధిస్తున్నారన్నారు. అనేక భాషలు బోధిస్తున్నప్పుడు మూడో భాషతో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇది తమిళనాడు ప్రభుత్వ రాజకీయ నిర్ణయమన్నారు.