
చేవెళ్ల బస్సు ప్రమాదం.. తొమ్మిది మంది మృతుల గుర్తింపు
TG: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 72 మంది ప్రయాణిస్తున్నారు, వీరిలో చాలామంది తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు చెందినవారు. మృతుల్లో ధన్నారం తండాకు చెందిన తాలీబామ్ (45), దౌల్తాబాద్ వాసి హనుమంతు (35), బోరబండ వాసి కల్పన (45), గుణమ్మ (60), తబస్సుమ్ జహాన్ (38), యాలాల్ వాసి అభిత (21), భానూరు వాసి నాగమణి (55), తాండూరుకు చెందిన ఖలీద్ స్సేన్ (76), తార భాయ్ ఉన్నారు.




