వారణాసిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర
మోదీ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడానికి తమ ప్రభుత్వం ప్రయత్నించిందని, కానీ
కాంగ్రెస్, ఎస్పీ వంటి ప్రతిపక్షాల నీచ రాజకీయాల వల్లే అది అమల్లోకి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల అభివృద్ధి, అసెంబ్లీలు, పార్లమెంట్‌లలో వారి ప్రాతినిధ్యం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, అందుకే 40 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళా రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తామని ప్రధాని
మోదీ అన్నారు.