
కెమికల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మంగళవారం ఉదయం ఒక రసాయన కర్మాగారంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.




