
సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు
విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో భారత క్రికెట్ జట్టు సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల విశాఖలో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.




