'పెట్రోల్‌ నిల్వలపై ఆందోళన అవసరం లేదు'

40చూసినవారు
'పెట్రోల్‌ నిల్వలపై ఆందోళన అవసరం లేదు'
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే దేశంలో 90 రోజుల వరకు ఇంధన నిల్వలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసర పుకార్లను నమ్మి ఇళ్లలో నిల్వ చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్