హెల్మెట్ లేనిదే మా ఊరిలోకి ప్రవేశం లేదు: గ్రామస్థులు

40చూసినవారు
హెల్మెట్ లేనిదే మా ఊరిలోకి ప్రవేశం లేదు: గ్రామస్థులు
మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామస్థులు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకుండా తమ గ్రామంలోకి రావొద్దని గ్రామశివారులో మంగళవారం బ్యానర్‌ ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం పోలీసులు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి, వాహన ప్రమాదాలు, హెల్మెట్‌ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీనితో స్ఫూర్తి పొందిన పంచాయతీ పాలకవర్గం, గ్రామంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు తప్పక హెల్మెట్‌ ధరించాలని తీర్మానించింది.