MGBS బస్టాండ్‌కు ఎవరూ రావొద్దు: TGSRTC
By Ravinder Enkapally 62605చూసినవారుTG: హైదరాబాద్ MGBS బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి నడుపుతోంది. జేబీఎస్ నుంచి ADB, KRNR, MDK, NZB వైపునకు వెళ్లే సర్వీసులు నడుస్తున్నాయి. WGL బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి.. SRPT, NLG, విజయవాడ వైపునకు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. MBNR, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి. ఇతర వివరాలకు TGSRTC కాల్ సెంటర్ నంబర్లను 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చు.