పాస్‌లు లేకుండా ఎవ్వరూ రావొద్దు: మహేశ్‌బాబు (వీడియో)

57చూసినవారు
గ్లోబ్‌ట్రాటర్‌ వేడుకపై హీరో మహేశ్‌బాబు అభిమానులకు కీలక సందేశం ఇచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో శనివారం జరగనున్న ఈ భారీ వేడుకలో సినిమా టైటిల్‌, టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు వీడియో విడుదల చేసి, పాస్‌లు ఉన్నవారే వేడుకకు రావాలని, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి సూచించిన గేట్‌ ద్వారా ప్రవేశించాలని కోరారు. తక్కువ వాహనాలతో రావడం, పోలీసులు–సిబ్బందికి సహకరించడం అందరికీ సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. “ఇంకా ఎన్నో వేడుకలు ఉంటాయి. కంగారొద్దు" అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :