
కుంగిన జాతీయ రహదారి.. పగుళ్లలో ఇరుక్కున్న పలు వాహనాలు..(వీడియో)
కేరళలోని కొట్టియం-మైలక్కడ్ 66వ జాతీయ రహదారి కొత్తగా వేసిన రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో పలు వాహనాలు అందులో చిక్కుకుపోయాయి. ఈ దుస్థితిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా ఈ విషయంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు.




