బీజేపీని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఒంటరిగా నిలువరించలేదని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఒకేవిధమైన భావజాలం ఉన్న పార్టీలతో కూటమి ఏర్పాటు కోసం చర్చించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. యూపీలో BJP మరోసారి అధికారంలోకి రాకూడదనే ఉమ్మడి లక్ష్యం ఉంటే కలిసి పని చేసేందుకు సిద్ధమన్నారు. అక్కడ 3వ సారి
బీజేపీ ప్రభుత్వం ఏర్పడకూడదని, పార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. 2027లో జరిగే
ఎన్నికలు గతంలో మాదిరి ఉండబోవని చెప్పారు.