ప్రాజెక్టుల నిర్మాణంలో కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం చూస్తే సహించేది లేదని, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదుల రిజర్వాయర్ నుండి డిండికి నీటిని తరలిస్తే ఊరుకునేది లేదని, ప్రాజెక్టుల నిర్మాణంలో తమ కుటుంబాలు కూడా భూములు త్యాగం చేశాయని ఆయన గుర్తు చేశారు.