
డిసెంబర్లో ఐపీఎల్ 2026 వేలం
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లను నిలుపుకోవడానికి ఫ్రాంచైజీలకు నవంబర్ 15 వరకు గడువు ఉంది. వేలం ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే బీసీసీఐ భారతదేశంలోనే మినీ వేలం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.




