
డీబీటీ నగదు బదిలీ ద్వారా రూ. 4.31 లక్షల కోట్లు ఆదా: నిర్మలా సీతారామన్
డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా లబ్దిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల ప్రభుత్వానికి 4 లక్షల 31 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో ఆమె మాట్లాడుతూ.. GIFT (Global Financial Infrastructure for Foreign Currency Settlement) సిస్టమ్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇది విదేశీ కరెన్సీ లావాదేవీలను రియల్-టైమ్‌లో పూర్తి చేస్తుందని తెలిపారు.




