TG: స్థానిక ఎన్నికలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కు ఎలాంటి అడ్డంకులు లేవని, షెడ్యూల్ ప్రకారమే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని ఆయన అన్నారు. కోర్టులో తమ లాయర్లు బలమైన వాదనలు వినిపించారని చెప్పారు. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, కోర్టులోనూ ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.