ఐదు గ్రామాల్లో నామినేషన్లు నిల్.. 133 వార్డుల్లోనూ అదే పరిస్థితి

57చూసినవారు
ఐదు గ్రామాల్లో నామినేషన్లు నిల్.. 133 వార్డుల్లోనూ అదే పరిస్థితి
రాష్ట్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రామాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో మూడు, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం 133 వార్డులకు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. మంచిర్యాల జిల్లాలో 34, ఆసిఫాబాద్​లో 30, జనగామలో 10, వికారాబాద్​లో 19, గద్వాలలో 9, నిర్మల్​లో 7, ములుగులో 4, ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో 3 చొప్పున, భువనగిరి, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 2 చొప్పున, సూర్యాపేట, జగిత్యాల, వనపర్తిలో ఒక్కో వార్డు చొప్పున నామినేషన్లు రాలేదు.

సంబంధిత పోస్ట్