తెలంగాణలో మూడోవిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 5. ఈ నెల 6న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 9వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఈ నెల 17న మూడో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి, అదే రోజు ఫలితాలు వెలువడతాయి.