ఉత్తర కొరియా సేనలు చైనా సమీపంలోని తమ రహస్య స్థావరంలో దీర్ఘశ్రేణి క్షిపణులు, అధునాతన ఆయుధాలను మోహరించాయి. చైనా సరిహద్దుకు 27 కి.మీ. దూరంలోని సిన్‌పుంగ్‌లో ఈ క్షిపణి స్థావరం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ.. తమ అణ్యాయుధ శక్తిని విస్తృతం చేయడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.