చుక్క నీరు కిందపడలేదు.. వందేభారత్‌ రైలు వీడియో వైరల్‌

31చూసినవారు
దేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. త్వరలో స్లీపర్ క్లాస్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో స్లీపర్ వందేభారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరీక్షలు నిర్వహించగా, రైలులో నీటితో నింపిన మూడు గ్లాసులు తొణకకుండా నిలవడం గమనార్హం. ఈ పరీక్షల్లో రైలు స్థిరత్వం, బ్రేకింగ్, ప్రయాణ అనుభవాన్ని పరిశీలించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రైల్వే పనితీరును పలువురు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్