TG: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తూ వేగంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జనవరి 1 నాటికి 16,32,810 కొత్త కార్డులు మంజూరు చేశామని, మొత్తం 89,95,282 కార్డులు ఉన్నాయని వివరించారు.