ప్రమాదం కాదు పక్కా మర్డర్.. కేతన్ అగర్వాల్ కేసులో 5,053 పేజీల ఛార్జ్‌షీట్!

39చూసినవారు
ప్రమాదం కాదు పక్కా మర్డర్.. కేతన్ అగర్వాల్ కేసులో 5,053 పేజీల ఛార్జ్‌షీట్!
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోహగఢ్‌ కోట పైనుంచి పడి మృతి చెందిన వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇది ప్రమాదం కాదని, హత్యేనని పేర్కొంటూ పుణె రూరల్‌ పోలీసులు వడ్గావ్‌ మావల్‌ కోర్టులో 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కేతన్‌ కాబోయే భార్య సియా గోయల్‌, ఆమె ప్రియుడు చేతన్‌ చౌదరిపై ఆరోపణలు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, వాట్సాప్‌ చాట్స్‌, మొబైల్‌, కాల్‌ డేటా, ఫోరెన్సిక్‌ ఆధారాలతో పాటు 80–85 మంది సాక్షుల వాంగ్మూలాలను సమర్పించారు. జూన్‌ 14న కేతన్‌ను కొండపై నుంచి తోసే ప్రయత్నం జరిగినట్లు, జూన్‌ 18న మరోసారి ఘటన జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్