అరెస్ట్ చేయించేంత పిరికిపందలం కాదు: మంత్రి పొన్నం

0చూసినవారు
TG: చర్చకు సిద్ధమని, పోలీసులతో అరెస్ట్ చేయించేంత పిరికివాళ్లం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గన్ పార్క్ వద్దకు రమ్మని, ఫోన్ లిఫ్ట్ చేయలేదని హరీష్ రావు ఆరోపించడం సరికాదన్నారు. గోషా మహల్, మలక్ పేటలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలకు వెళ్లినందున ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలిపారు. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లు కిందిస్థాయి నుంచి వచ్చినవారని, బీఆర్ఎస్ తో కుమ్మక్కై లాభపడిన చెంచా గాళ్లు ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్