
దారుణం.. 14 ఏళ్ల బాలికపై స్నేహితురాలి తండ్రి అత్యాచారం
ఆడుకునేందుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన 14 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితురాలి తండ్రి హత్యాచారం చేసిన ఘటన పంజాబ్లోని జలంధర్ లో జరిగింది. అయితే తమ కూతురు కనిపించడం లేదని.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు CCTV విజువల్స్ పరిశీలించగా ఈ దారుణం బయటపడింది. దీంతో బాలిక తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలిక ఇంటికి వచ్చిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఆమెపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.




