ప్రముఖ దర్శకుడు అనిక్ దత్తా కన్నుమూత

60చూసినవారు
ప్రముఖ దర్శకుడు అనిక్ దత్తా కన్నుమూత
ప్రముఖ బెంగాలీ దర్శకుడు అనిక్ దత్తా బుధవారం మధ్యాహ్నం దక్షిణ కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. గరియాహట్ సమీపంలో తన నివాసంలోని డాబాపై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 'భూతేర్ భబిష్యత్', 'బరున్‌బాబుర్ బంధు', 'అపరాజితో' వంటి చిత్రాలతో బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దత్తా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు నరేంద్ర చంద్ర దత్తా మనవడు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్