ప్రముఖ మలయాళ కవి, సాహితీ విమర్శకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పి. నారాయణ కురుప్ (92) శనివారం తిరువనంతపురంలోని తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 1934 సెప్టెంబర్ 5న జన్మించిన ఆయన, కవిగా, విమర్శకుడిగా మలయాళ సాహిత్యంలో విశేష సేవలందించారు. కథాకళి, కూడియాట్టం వంటి కళల విమర్శకుడిగానూ, పలు సాహిత్య సంస్థలకు అధ్యక్షుడిగానూ పనిచేశారు. 1991లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, 2014లో వల్లథోల్ అవార్డు, 2022లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.