తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీని పారదర్శకంగా నిర్వహించాలని సర్కార్ ఆదేశించింది. అర్హులైన ప్రతి మహిళకు చీర అందేలా చూడాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వరాదని స్పష్టం చేసింది. పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించినట్లు వెల్లడించింది. నవంబర్ 19న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు కొనసాగుతుంది.