రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 3,477 గ్రాడ్యుయేట్ స్థాయి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 8 నుంచి నవంబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు, ఖాళీల వివరాలను RRB వెల్లడించనుంది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు.