అంగన్‌వాడీ టీచర్ల భర్తీ.. దరఖాస్తులకు ఆహ్వానం

1006చూసినవారు
అంగన్‌వాడీ టీచర్ల భర్తీ.. దరఖాస్తులకు ఆహ్వానం
TG: హనుమకొండ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భీమదేవరపల్లి, హనుమకొండ అర్బన్, పరకాల ప్రాజెక్టులలో మొత్తం 55 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపిక అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. మరిన్ని వివరాలకు mis.tgwdcw.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్