తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమైంది. త్వరలో 1,597 ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ వివిధ శాఖల్లో 1800 పోస్టుల భర్తీకి జూన్ నెలలో నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా సీఎం ఆదేశాల మేరకు పలు శాఖల్లో 290 పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరో 1597 పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించినట్లు సమాచారం.