ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుకు ఛాన్స్!

1చూసినవారు
ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుకు ఛాన్స్!
2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాల కోసం టీజీఆర్‌జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది. మార్చి 2026లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులు. ఏప్రిల్ 15, 2026 వరకు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మే 3, 2026న జరగనుంది. పదో తరగతి పూర్తి చేసిన వారికి ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ చదవడానికి ఇది మంచి అవకాశం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్