ప్రసార భారతి త్వరలోనే 'డైరెక్ట్ టు మొబైల్' (D2M) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వైఫై, మొబైల్ డేటా లేదా సిమ్ కార్డు అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్లలో నేరుగా లైవ్ టీవీ ఛానెళ్లు చూడవచ్చు. ఐఐటీ కాన్పూర్, తేజస్ నెట్‌వర్క్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా ఉచితంగా లైవ్ టీవీ ప్రసారాలు చూడవచ్చు. దేశవ్యాప్తంగా 19 నగరాల్లో ట్రయల్స్ విజయవంతం కాగా, అక్టోబర్‌లో కమర్షియల్ అమలు కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేయనున్నారు.