తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) తమ ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) నేపథ్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. మొబైల్ నంబర్ లింక్ లేకపోతే, ఎన్నారైలు ఆన్‌లైన్‌లో తమ వివరాలను సమర్పించడం సాధ్యం కాదని, ఓటర్ల జాబితాలో చేరడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు తెలిపారు.