
అమెరికా ఆంక్షల నుంచి భారత్‌కు ఊరట
ఇరాన్‌లోని చాబహార్ పోర్టు విషయంలో భారత్‌కు ఊరట లభించింది. వచ్చే ఏడాది ప్రారంభం వరకు అమెరికా ఆంక్షల నుంచి దీనికి మినహాయింపు దొరికింది. అమెరికా గతంలో ఇచ్చిన మినహాయింపునకు గడువు ముగిసిన నేపథ్యంలో ఈ గడువు పొడిగింపు వచ్చింది. దీంతో చాబహార్ పోర్ట్‌లోని షహీద్ బెహెస్తీ టెర్మినల్ అభివృద్ధి, నిర్వహణకు భారత్‌కు వీలు కలిగింది. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం నెరపడానికి చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది.




