ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి: మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

54చూసినవారు
ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి: మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
AP: టీడీపీ ‘మహానాడు’లో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ చేసిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభిచింది. సీఎం చంద్రబాబు ఈ డిమాండ్‌ను సభ ముందుంచగా, పార్టీ నేతలు, కార్యకర్తలు చేతులెత్తి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుజాతి ఆరాధించే మహానాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన జయంతి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు పండుగ రోజు అని అన్నారు. దేశానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్