రైల్వే జేఈ పోస్టుల సంఖ్య పెంచిన RRB

23126చూసినవారు
రైల్వే జేఈ పోస్టుల సంఖ్య పెంచిన RRB
జూనియర్ ఇంజినీర్ పోస్టులను 2,588కి పెంచుతూ RRB ప్రకటన విడుదల చేసింది. జమ్మూ–శ్రీనగర్, చెన్నై రీజియన్లలో పోస్టులను పెంచారు. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 10కి పొడిగించారు. ఇప్పటికే అప్లై చేసిన వారు నవంబర్ 25 నుంచి ఫీజు లేకుండానే పోస్టు, జోన్ ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు డిసెంబర్ 12 వరకు, అప్లికేషన్ సవరణకు డిసెంబర్ 13–22 వరకు అవకాశం ఉంది.