TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో నర్సింగ్ విద్యార్థిని హరిణి (18) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆమె సెలవుల నేపథ్యంలో ఇటీవల ఇంటికి వచ్చింది. ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక ఒంటిపై గాయాలతో మృతదేహం కనిపించింది. పక్కింటి వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడని హరిణి తల్లి రాజేశ్వరి ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.