విండోస్‌ ల్యాప్‌టాప్‌ మార్కెట్లోకి ఎన్విడియా ఎంట్రీ

35చూసినవారు
టెక్ దిగ్గజం ఎన్విడియా పీసీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తైవాన్‌లో జరిగిన కంప్యూటెక్‌ ట్రేడ్‌ షోలో సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటెల్‌ నుంచి మార్కెట్ వాటాను దక్కించుకోవాలనే లక్ష్యంతో, ఎన్విడియా 'ఆర్టీఎక్స్‌ స్పార్క్‌ సూపర్‌ చిప్‌'ను ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లలో అందుబాటులోకి తీసుకురానుంది. మైక్రోప్రాసెసర్, గ్రాఫిక్స్ చిప్‌లను కలిపి రూపొందించిన ఈ చిప్‌ను తైవాన్ మీడియాటెక్‌తో కలిసి తయారు చేస్తున్నారు.

ట్యాగ్స్ :