యుక్తవయసులోనే ఊబకాయం, PCOS: వైద్యుల ఆందోళన

8465చూసినవారు
యుక్తవయసులోనే ఊబకాయం, PCOS: వైద్యుల ఆందోళన
దేశంలోని ప్రతిష్టాత్మక వైద్య సంస్థ AIIMS వైద్య నిపుణులు యుక్తవయస్సులో ఉన్న పిల్లలు తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా టీనేజ్ బాలికలు, యువతులలో ఊబకాయం, PCOS కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక డిజిటల్ స్క్రీన్ టైమ్ దీనికి ప్రధాన కారణాలని AIIMS వైద్యులు విశ్లేషించారు. పోషకాహార నియమాలు, రోజూ వ్యాయామం, డిజిటల్ వెల్‌బీయింగ్ పాటించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్