
హైదరాబాద్లో విరిగిపడ్డ కొండచరియలు (వీడియో)
TG: హైదరాబాద్లోని మల్కాజిగిరి గౌతమ్ నగర్లో బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జీహెచ్ఎంసీ వాహనంపై కొండచరియలు కూలిపోయాయి. అదృష్టవశాత్తు, వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.




