TG: కార్తీక పౌర్ణమి వేళ వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని జంతువును బలి ఇచ్చి క్షుద్రపూజలు చేశారని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలా క్షుద్ర పూజలు జరగడం ఇది రెండోసారి అని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.