టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఆదివారం విండీస్‌తో తొలి పోరులో
భారత్ తలపడనుంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ 14-20 వన్డేలు మాత్రమే ఆడనుండటంతో ప్రతి మ్యాచ్‌నూ ఉపయోగించుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్
కోహ్లీ (రోకో)సన్నద్ధతతో పాటు యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించనుంది. మ. 2 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోస్టార్‌లో లైవ్ చూడవచ్చు.